వందా..బొందా..జడ్పీటీసీలను గెలిపించు!

4
- Advertisement -

వందా…బొందా అని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రేవంత్ రెడ్డిని ముందు కొడంగల్లో జడ్పీటీసీలను గెలిపించుకోమను అన్నారు. కేటీఆర్ నల్లమల పులి అంటాడు.. మళ్లీ నల్లమల తెలంగాణలోనే ఉందా అని అంటాడు. ఇంత నికృష్టమైనోడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.

నిజాలు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను… చంద్రబాబు నాయుడి కోవర్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఏలుతున్నాడు అన్నారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు కోవర్టు పాలన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు అని స్పష్టం చేశారు.

Also Read:రైతు సమస్యలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

రైతులకు ఎకరానికి రూ.15 వేలు, మూడు పంటలు వేస్తానని అన్నాడు.. ఎవరికైనా పడ్డాయా?..నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు మొత్తం రూ.39 వేల కోట్లు ఎగగొట్టాడు అన్నారు. రైతు రుణమాఫీ రూ.38 వేల కోట్లు ఎగగొట్టిండు.. కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు అన్నారు.

- Advertisement -