బీజేపీ విధానాలు నచ్చకపోతే వెళ్లిపోండి!

9
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు రామచంద్రరావు. ఈ నేపథ్యంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు.. పార్టీని వీడినా నష్టం లేదు అన్నారు. పార్టీని నమ్ముకున్నవారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు.

అంతకుముందు ఆయన చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరవీరుల స్మారక చిహ్నాం వద్ద నివాళి అర్పించారు.
రామచంద్రరావు వ్యాఖ్యలను చూస్తూంటే అవి రాజాసింగ్‌ను ఉద్దేశించినవేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

రాజాసింగ్‌ను వదిలించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానానికి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోండగా ఈ లేఖపై సంతకం చేసిన వారిలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌, కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు సహా ముఖ్య నేతలంతా ఉన్నట్టు సమాచారం.

Also Read:వందా..బొందా..జడ్పీటీసీలను గెలిపించు!

- Advertisement -