మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్, తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.. అలానే మోసపూరితంగా కూడా ఉంటాయి అన్నారు.
పదే పదే హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేసానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు… చంద్రబాబువి చెత్త మాటలు కొట్టి వేద్దాం అనుకుంటే, 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారు అన్నారు. 2004లో చంద్రబాబు దిగిపోయేనాటికి సమైక్యాంద్ర తలసరి ఆదాయం 25,900 రూపాయలు అన్నారు.
2014లో ఏపీని చంద్రబాబు 5 సంవత్సరాలు పరిపాలిస్తే.. కేసీఆర్ గారు 2014 నుండి 2023 వరకు తెలంగాణను పరిపాలించారు… అప్పుడు మొత్తం భారత దేశంలో ఏ రాష్ట్రంలో రాని అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది.. కాని మీరు 5 సంవత్సరాలు ఏపీలో పని చేస్తే అక్కడ తలసారి ఆదాయం మాలాగా పెరగలేదు అన్నారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన నాడు 1,12,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే, ఇవాళ 3,60,000 రూపాయలకు వచ్చింది.. కాని ఇవాళ్టికి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,50,000 రూపాయలు మాత్రమే… నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు అన్నారు.
Also Read:జూరాలకు పోటెత్తిన వరద

