కాంగ్రెస్ సంబరాలు దేనికోసం?

5
- Advertisement -

ఒక వర్గం మీడియా పథకం ప్రకారం ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్య పంచాయితీలాగా చూపించే ప్రయత్నం చేస్తుంది అని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన…కేవలం తెలంగాణ రాజకీయ పార్టీ వాళ్ళను పిలిచి మీరు ఏం చేశారు అంటే మీరు ఏం చేశారు అని చర్చలు పెట్టి.. నీటిని వాళ్ళు వేసుకుపోడానికి కావాల్సిన వాతావరణం కలిపించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.

ఇది బజారు పంచాయితీ కాదు బతుకుదెరువు పంచాయితీ …ఇది ఎదో కేవలం తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పంచాయితీ లాగా చూపిస్తున్నారు అన్నారు. మీరు మీరు తన్నుకుంటే మేము నీళ్లు వేసుకుపోతాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు అన్నారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి మాట్లాడాలి…
గోదావరి కావేరి నదులను లింక్ చేస్తామని చంద్రబాబు మాయ మాటలు చెప్తున్నాడు అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గోదావరి కావేరి నదుల లింక్ ను వ్యతిరేకించింది… గోదావరి కావేరి లింక్ లేదని గతంలో LWD స్పష్టం చేసింది, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ గోదావరి కావేరి లింక్ అంశం తెరపైకి తెచ్చి కుట్ర చేస్తున్నాడు అన్నారు. మోదీకి చంద్రబాబుతో అవసరం ఉంది కాబట్టి మాట్లాడటం లేదు.. కానీ తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించింది తెలంగాణ ప్రజలు అన్నారు. మరి తెలంగాణ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు ? చెప్పాలన్నారు.

నీరు సముద్రంలో కలుస్తుంది అనేది పెద్ద కుట్ర.. చంద్రబాబు అలా ప్రచారం చేసి తెలంగాణ ప్రజలను మాయలో పడేసి తాను బయట పడాలని అనుకుంటున్నాడు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 11 సార్లు రైతుబందు వేసినం, ఎప్పుడూ ఇంత హంగామా చేయలేదు.. వడ్ల కల్లాల్లో వడ్లు నానబెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా ? చెప్పాలన్నారు. నాలుగు విడతల రైతుబందు ఎగ్గొట్టి ఎన్నికల ముందు ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? , నదుల నీళ్లను, ఉన్న ప్రాజెక్టులు ఉపయోగించి రైతులకు నీళ్లు ఇవ్వక అప్పు పాలు చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు.

Also Read:విజయోత్సవాలు కాదు..సారీ చెప్పాలి!

- Advertisement -