కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా?,కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఇస్తాం.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు కుదించి.. అది కూడా ఇవ్వనందుకా? చెప్పాలన్నారు.
రూ.2 లక్షలు రుణమాఫీ అని చెప్పి అరకొర చేసి ఎగ్గొట్టినందుకా?,ఏ కారణం చేత రైతు మరణించినా ఆ కుటుంబానికి ధీమాగా ఉండాలని రూ.5 లక్షల సాయం అందించే రైతుబీమా రాకుండా చేసినందుకా?,ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో దాదాపు 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా?,వానాకాలం పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ బకాయిలు ఎగ్గొట్టినందుకా? యాసంగి పంటకు క్వింటాలుకు రూ.500 అసలు బోనస్ ఇవ్వనందుకా? చెప్పాలన్నారు.
కల్లాలకు వచ్చిన ధాన్యం నెలల తరబడి కొనకుండా కండ్ల ముందు అకాల వర్షాల పాలయ్యేలా చేసి కన్నీళ్లు పెట్టించినందుకా?,కల్లాల్లో ధాన్యం ఉండగానే వాటిని కొనకుండా కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినందుకా?,పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆత్మవిశ్వాసం నింపుకుని ఆత్మస్థైర్యంతో ఉన్న రైతులను కేవలం 18 నెలల పాలనతో నిండా ముంచి, వ్యవసాయం నడ్డి విరిచినందుకా?,లగచర్ల రైతులను జైలుకు పంపినందుకా? పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు వేసినందుకా? చెప్పాలన్నారు.
ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ లాగా ఒక్క పథకం అయినా ప్రవేశపెట్టారా?,కోటి 50 లక్షల ఎకరాలకు నాలుగు విడతల్లో ఎకరాకు రూ.30 వేల చొప్పున ఈ ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టింది. ,నాలుగు విడతలుగా ఎగ్గొట్టిన రైతు భరోసా స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు అన్న భయంతో అయినా రైతు భరోసా వేస్తున్నారని.. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అని రైతులు సరిపెట్టుకుంటున్నారు తప్ప సంబరాలు చేసుకోవడం లేదు అన్నారు. నాలుగు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండగ పేరుతో సంబరాలు చేయాలి అనడాన్ని తీవ్రంగా ఖండించారు.
Also Read:విజయోత్సవాలు కాదు..సారీ చెప్పాలి!

