KTR:బీఆర్ఎస్‌తోనే భవిష్యత్

46
- Advertisement -

కాంగ్రెస్ అనేది గతం…బీఆర్ఎస్‌తోనే భవిష్యత్ అన్నారు మంత్రి కేటీఆర్. ఓ ఛానల్ నిర్వహించిన మెగా కన్‌క్లేవ్ 2023లో పాల్గొని మాట్లాడిన కేటీఆర్.. సంక్షేమాన్ని కడుపునిండా చేస్తూ పేదల్ని, పెద్దల్ని అందరినీ ఏకకాలంలో సంతృప్తి పరుస్తున్న ప్రభుత్వం, పర్ఫార్మింగ్‌ గవర్నమెంట్‌ అనేది చాలా ముఖ్యం అన్నారు.

ఏ రాష్ట్రమైనా ముందుకు పోవాలి.. అందులోనూ ఓ కొత్త రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండాలన్నారు. అది ఏ కాంగ్రెస్‌ వల్లో, బీజేపీ వల్లో అయ్యే పని కాదు. కేవలం బీఆర్‌ఎస్‌ వల్ల మాత్రమే అది సాధ్యం. ఒక విజన్‌ ఉన్న నాయకత్వం కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు.

మంచిగా పనిచేసే వాళ్లని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. కేసీఆర్‌ మీ జేబులో ఉన్న వంద రూపాయి నోటు లాంటోడు. కింద రోడ్డుమీద ఏదో చిల్లర కనిపిస్తే దాని కోసం ఆశపడితే జేబులో ఉన్నది పోతుందన్నారు. కొన్ని విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఇవాళ మొత్తం భారతదేశం పరిస్థితి చూసుకుంటే ఇంత వేగంగా మౌలిక వసతుల కల్పన చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

స‌బితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గ‌ర్వం లేదు….త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ని చేశార‌ని, ఇలాంటి ఎమ్మెల్యేను ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు అని ప్ర‌శంసించారు. . రోజు మీతో క‌లిసి ఉండే వ్య‌క్తి. స‌బిత‌కు ఎంత ఓపిక ఉంట‌దో మీకు తెలుసు. భూదేవీకి ఎంత ఓపిక‌ ఉంట‌దో స‌బిత‌కు అంత ఓపిక‌ ఉంటుంది. ఆమె వేరు వ్యాప‌కం లేదు. సుదీర్ఘం రాజ‌కీయ అనుభ‌వం ఉందన్నారు.

కాంగ్రెస్‌ అనేది గతం.. బీఆర్‌ఎస్‌ అనేది భవిష్యత్తు అన్నారు. వర్తమానమూ భవిష్యత్తూ రెండూ అల్టిమేట్‌గా అవగాహన ఉన్న పార్టీ బీఆర్‌ఎస్‌. భవిష్యత్తును ఆశించేవారు, భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని కోరుకునే వారు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలన్నారు. తాగునీరు, కరెంట్‌, సాగునీరు ఇలా అన్నింటినీ ఎంతో వేగంగా ప్రజలకు అందించిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నారు.

Also Read:Cumin:జీలకర్రతో ఆ సమస్యలన్నీ దూరం!

- Advertisement -