- Advertisement -
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆసిఫాబాద్ నియోజకవర్గం, రెబ్బన మండలంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి రెబ్బన మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Also Read:యూరియా కోసం రైతుల తిప్పలు
- Advertisement -

