మల్కాజ్గిరిలో గెలిచేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం లో మాట్లాడిన మల్లారెడ్డి…రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు. మేము మేము గెలుస్తాం అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు…వాళ్ళు చేసిందేమీ లేదు అన్నారు. 75 ఏళ్ల స్వతంత్రం వచ్చి ఏ రంగం బాగుపడలేదు అన్నారు.
వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని…వాళ్ళకి క్యాడర్ లేదు అన్నారు. ఏం మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు,1200 గ్యాస్ సిలెండర్ పెంచి పేదలను దోచుకుంటున్నారు అన్నారు. దేశ ప్రజలను జాతీయ పార్టీలు మోసం చేశాయని,బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు. ఎట్లా గెలుస్తుందో చెప్పాలన్నారు. మొన్న ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేసామో అని అనుకుంటున్నారు…హైదరాబాద్, మల్కాజ్ గిరి లో బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారన్నారు.
ఊర్లలో మాత్రం బీ ఆర్ ఎస్ ఓడింది, ఇక్కడ గెలవడానికి కారణం కేటీఆర్ చేసిన అభివృద్ది అన్నారు. ప్రతిపక్షాలకు ఓటు బ్యాంక్ లేదు,ఎండాకాలం వస్తే నిండు కుండల చెరువులు, ప్రాజెక్టులు ఉండేనన్నారు.కానీ ఇప్పుడు ఎండి పోయినయ్,మళ్ళీ కేసిఆర్ అదికారంలోకి రావాలి అప్పుడే ప్రాజెక్టుల్లో నీళ్లు వస్తాయన్నారు.
Also Read:రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్-అదితి