MLC Kavitha:BRS అంటే బీసీల సర్కార్

35
- Advertisement -

బీఆర్ఎస్ అంటే బీసీల సర్కార్ అన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్ గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత..కులవృత్తులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలప్పుడు అనేక పార్టీలు వస్తాయి. వారిని నిలదీయండి. బీఆర్‌ఎస్‌ పార్టీగా పని చేశాం కాబట్టి హక్కుగా ప్రజల వద్దకు వస్తున్నాం. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

కుల వృత్తులు పూర్వ వైభవం వం తీసుకువస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల నగారా నిన్ననే మోగింది. మొట్టమొదటి సమావేశం గౌడ కుల బాంధవులతో జరుపుకోవటం సంతోంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశారు….కానీ కేసీఆర్ ఆనాడే ఉద్యమ సమయంలో చెప్పారని గుర్తుచేశారు.

గీత కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పాలసీగా తీసుకొని ఈత వనాలని పెంచుతుందని.. మద్యం టెండర్లలో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నం అని చెప్పారు.

Also Read:టైగర్ ష్రాఫ్ వీరోచిత పోరాటాలతో..’గణపధ్’

- Advertisement -