బి‌ఆర్‌ఎస్ దూకుడు.. ఆపేదెవ్వరు !

60
- Advertisement -

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ మరోసారి అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కే‌సి‌ఆర్.. తనదైన రీతిలో పాలన సాగిస్తూ ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో అమలౌతున్న ఎన్నో పథకాలు మరెక్కడా అమలు కావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. 24 గంటల ఉచిత కరెంటు, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు.. ఇలా ఎన్నో పథకాలుతో ఇతర రాష్ట్రాలలో ఎక్కడ జరగని సంక్షేమం ఒక్క తెలంగాణలోనే సాధ్యం చేశారు.

దాంతో కే‌సి‌ఆర్ సుపరిపాలనను తెలంగాణ ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికి.. ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితులు లేవనేది జగమెరిగిన సత్యం. బీజేపీకి అవకాశం ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టినట్లే అనే సంగతి తెలంగాణ ప్రజానీకానికి బాగా తెలుసు. అలాగే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కల్లోలం దృష్ట్యా ప్రజలు ఆ పార్టీకి ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడ బి‌ఆర్‌ఎస్ కు తిరుగులేదనే మాట అధికంగా వినిపిస్తోంది.

Also Read: కాంగ్రెస్ ను జేడీఎస్ నమ్మట్లేదా ?

ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు 90 నుంచి 100 సీట్లు రావడం ఖాయమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన మాట అక్షరాల నిజం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే వరుసగా మూడవసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన నేతగా కే‌సి‌ఆర్ దేశ రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేయడం ఖాయం. ఇక మరోవైపు దేశ రాజకీయాల్లో కూడ బి‌ఆర్‌ఎస్ దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఇతర పార్టీల నేతలు బి‌ఆర్‌ఎస్ వైపు విపరీతంగా ఆకర్షితులౌతున్నారు. దేశ ప్రజలు కూడ తెలంగాణ మోడల్ కోరుకుంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో బి‌ఆర్‌ఎస్ దేశ రాజకీయాలను శాసించే అవకాశం ఉండని విశ్లేషకుల అంచనా.

Also Read: కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టే అభ్యర్థి ఎవరు ?

- Advertisement -