అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఈసీకి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్.
నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకోరాదని, సలహాదారులకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది.కానీ ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మహబూబాబాద్ జనజాతర సభకు సంబంధించిన ప్రెస్ మీట్‌లో పాల్గొనడం జరిగింది.దీనిపై Election Commission of India తక్షణమే స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరుపున కోరుతున్నాం అని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Also Read:‘మై డియర్ దొంగ’..లాంటి కాన్సెప్ట్ సినిమాలే చేస్తాం