చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు కవిత. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు.
జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని …ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారని… రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు.
మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదని వెల్లడించారు.దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..