బీఆర్‌ఎస్‌ బీసీల ప్రభుత్వం:హరీశ్‌

47
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఉగాది శ్రీరామనవమి తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి కురుమ సంఘం బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి జిల్లాల్లో కురుమ భవన్‌ నిర్మిస్తునట్టు తెలిపారు. బాల్యవిహహాలను ఆపి కళ్యాణలక్ష్మి ద్వారా 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడుచుకు సీఎం కేసీఆర్ మేనమామ లాగా ఆదుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ శాఖ కావాలని అడిగామని ఇప్పటివరకు ఎలాంటి అతిగతి లేదన్నారు. హైదరాబాద్‌లో కురుమ జాతి ఆత్మగౌరవ భవనం రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు.కొమురవెళ్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కురుమలకు కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.

ఇవి కూడా చదవండి…

మహారాష్ట్రలో బీఆర్ఎస్ రైతు నాయకుడిగా మాణిక్..

కోల్‌కతా…పరీక్ష కోసం గ్రీన్ కారిడార్

శంషాబాద్‌లో ఆలయ్‌ రోలింగ్ మెడోస్ లగ్జరీ విల్లాస్

- Advertisement -