పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పనిచేస్తాం అన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. హైదరాబాద్ నందినగర్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు బీఎస్పీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. సమావేశం అనంతరం మాట్లాడిన కేసీఆర్…సిద్దాంత పరంగా బీఎస్పీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, మా ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన దళిత బంధు ఇందుకు ఉదాహరణ అన్నారు.దళిత సంక్షేమం, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రవేశ పెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌ది అన్నారు. బీఎస్పీ హైకమాండ్‌తో మాట్లాడిన తర్వాతే ఈ పొత్తు చర్చలు జరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీకి గౌరవప్రదమైన సీట్లు ఇస్తామన్నారు.
ఇక కేసీఆర్‌తో భేటీ కావడం ఆనందంగా ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. సెక్యులర్ భావాలు కలిగిన బీఆర్ఎస్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీలాగే ప్రవర్తిస్తోందని ఆరోపించారు ప్రవీణ్ కుమార్.
Also Read:ప్లాన్ ఫెయిల్..మోడీకి సానుభూతి గ్యారంటీ?