బ్రోకి నో కట్స్..అండ్ రన్ టైమ్ అదే!

36
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న సినిమా బ్రో ది అవ‌తార్. స‌ముద్రఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు శిల్ప క‌ళా వేదిక‌లో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ రానున్న‌ట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమా సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఎలాంటి క‌ట్స్ లేకుండా యు స‌ర్టిఫికేట్ పొందిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా ‘బ్రో’ ర‌న్ టైమ్ పై కూడా క్లారిటీ వచ్చింది. బ్రో ర‌న్ టైమ్ అన్నింటితో క‌లుపుకుని 134.30 నిమిషాలున్న‌ట్లు సెన్సార్ స‌ర్టిఫికేట్ ద్వారా తెలుస్తోంది. బ్రో సినిమా ఈనెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మరి ఏ రేంజ్ హిట్ ను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించారు. కాబట్టి.. త్రివిక్రమ్ పై నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేశాడు. సో.. ఈ సినిమా హిట్ బాధ్యత ఇప్పుడు త్రివిక్రమ్ మీదే ఉంది.

Also Read:Kanguva:క్రేజీ అప్‌డేట్

అన్నట్టు బ్రో మూవీ నుంచి మరో సాంగ్ విడుదల అయింది. తాజాగా ఈ మూవీలో థీమ్ ఆప్ బ్రో లిరికల్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించింది. అన్నట్టు జులై 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
బ్రో మూవీ ప్రీమియర్లు పడనున్నాయి.

Also Read:Pawan:ఓజి రిలీజ్ డేట్ ఛేంజ్‌!

- Advertisement -