పవన్ కళ్యాణ్ బ్రో మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరింది. వరల్డ్ వైడ్‌గా సోమవారం నాటికి 102 కోట్ల వసూళ్లను రాబట్టింది. రిలీజ్ రోజు వరల్డ్ వైడ్‌గా 30 కోట్లకు పైగా షేర్ ను రాబట్టిన ఈ మూవీ సోమవారం కేవలం రెండు కోట్ల యాభై లక్షల కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. వరుస రీమేక్ లుగా వచ్చిన వకీల్‌సాబ్, భీమ్లానాయక్, బ్రో మూవీలతో 100 కోట్ల క్లబ్ లో చేరి పవన్ కళ్యాణ్ హ్యట్రిక్ కొట్టినట్టయింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, తన సినిమాల్లో రాజకీయ అంశాలను పట్టుకొచ్చి.. అనవసరంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.
బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పై ఫన్నీగా ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసి.. అనవసరంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడు. దీంతో మంత్రి అంబటి రాంబాబు బ్రో సినిమా పై సెటైర్స్ కూడా వేశాడు. పనిలో పనిగా కొన్ని ఆరోపణలు కూడా చేశాడు. అంబటి చేసిన ఆరోపణలపై బ్రో సినిమా నిర్మాత విశ్వప్రసాద్ స్పందించాడు. ఈ సినిమాకు ఎంత ఖర్చయ్యిందో తనకి, జీటీవీకి మాత్రమే తెలుసునన్నారు. పవన్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే తమ సంస్థకు పవన్ కళ్యాణ్ కు ఉన్న ఒప్పందం గురుంచి అడిగే హక్కు ఎవరికి లేదని కామెంట్స్ చేశాడు.
Also Read:ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పిన తమన్నా
పైగా నిర్మాత నిర్మాత విశ్వప్రసాద్ రాజకీయ ఆరోపణలు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదని అన్నాడు. టాక్సులు ఫైలింగ్ చేసేప్పుడు ఇన్ కమ్ టాక్స్ వ్యవహారాలు చూసుకుంటామని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఉన్నాడు, కాబట్టి ప్రభుత్వాలు తమ పై చేసే విమర్శలను సీరియస్ గా చూడవు. కానీ ఒక నిర్మాత కూడా తమ పై పెదవి విరుపుడు మాటలు మాట్లాడితే.. ఏ ప్రభుత్వం అయినా ఎందుకు చూస్తూ ఉండాలి ?, తమ సహకారంతో సినిమా టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ.. తమ పైనే సెటైర్స్ వేస్తే.. ఎందుకు భరించాలి?. కచ్చితంగా నిర్మాత విశ్వప్రసాద్ సినిమాలకు ఇక ఏపీలో గడ్డు కాలం స్టార్ట్ అయినట్టే.
Also Read:పెళ్లి ప్రచారంపై తరుణ్ క్లారిటీ