పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో నిన్న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. మొదటి ఆట నుండే మంచి టాక్ రావడంతో వసూళ్లలోనూ సత్తాచాటింది.
బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పవన్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు ఏకంగా 48 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే 35.24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Also Read:మళ్ళీ మొదలెట్టిన బీజేపీ?
ఇక రెండో రోజు బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మొత్తం రెండు రోజుల్లో 75 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. పవన్ కెరీర్ లో రెండు రోజుల్లోనే ఇన్ని కలెక్షన్స్ ఇదే మొదటి సారి.
Also Read:దటీజ్ చిరు…’భోళా శంకర్’