బ్రిజ్‌భూషణ్‌పై చర్యలేవి…రెజ్లర్ల దీక్షలో ప్రియాంక

63
- Advertisement -

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా సంఘీభావం తెలిపారు. ఈమేరకు ఢిల్లీలోని నిరసనకారులకు మద్దతుగా సంఘీభావం పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. ఈ ఉదయం జంతర్ మంతర్ వద్ద దీక్షా శిబిరానికి వచ్చిన ఆమె…రెజ్లర్లతో మాట్లాడి వారిని ఓదార్చారు.

ఈ సందర్భంగా ప్రియాంకా వాద్రా మాట్లాడుతూ…రెజ్లర్లు పతకాలు గెలిచినప్పుడు మనమంతా ట్విటర్‌లో పోస్టు పెట్టి గర్వపడ్డాం. కానీ ఇప్పుడు ఇదే క్రీడాకారులు న్యాయం కోసం రోడ్లమీదకొచ్చారు. మహిళా రెజ్లర్లంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గత్యంతరం లేక ఇలా గొంతెత్తి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. అలాగే వీరి ఆవేదనను వినకుండా బ్రిజ్ భూషణ్ ను ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. ఇంతవరకు బ్రిజ్ భూషన్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇంతవరకు కాపీలను ఎందుకు బయటకు చూపించలేదు. అందులో ఏముందో ఎవరికి తెలియదని అన్నారు. ఎఫ్‌ఐఆర్ కాపీలను ఎందుకు బయటపెట్టట్లేదు అని ప్రశ్నించారు.

బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రెజ్లర్లకు మద్ధతు ఇవ్వాలని కోరగా.. కాంగ్రెస్‌ నేతలు భూపిందర్ హూడా దీపిందర్ హూడా ఉదిత్ రాజ్ ప్రియాంక వాద్రా తదితర నాయకులు సంఘీభావం తెలిపారు. ఈరోజు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా రెజ్లర్లకు సంఘీభావం తెలపనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Supreme Court:హెట్‌ స్పీచ్‌లపై కేసులు నమోదు..

అయితే దీనిపై బ్రిజ్‌భూషణ్ స్పందిస్తూ…తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ తనకు ఇంతవరకు అందలేదని తెలిపారు. నేను అమాయకుడిని న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. సుప్రీకోర్టు ఆదేశాలను గౌరవిస్తా…అలాగే విచారణను ఎదుర్కొంటా అని అన్నారు. రాజీనామా చేయడం అనేది పెద్ద విషయం కాదు. కానీ నేనే తప్పు చేయలేదు. క్రిమినల్‌ను కాదు…ఒకవేళ అలా చేస్తే వారు చెప్పింది నిజమవుతుంది కదా అని పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో విస్తారంగ వానలు… ఆరెంజ్ అలర్ట్ జారీ

- Advertisement -