మొక్కలు నాటిన నూతన వధూవరులు

323
marriage
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు హంగు ఆర్భాటాలు లేకుండా ముఖరం గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ; MPTC గాడ్గే సుభాష్ ఆధ్వర్యంలో కేవలం 20 మంది పెద్దల సమక్షంలో భౌతిక దూరం పాటిస్తూ ముఖాలకు మాస్క ధరించి గ్రామంలోని శివాలయం లో వివాహం చేసుకున్న ముఖరం గ్రామానికి చెందిన అంకుష్,కాంబ్లే జిజాబాయ్ నూతన వధూవరులు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో మీము వివాహం చేసుకున్న శివాలయం ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ మొక్కలు నాటిన జ్ఞాపకం మాకు ఎప్పుడూ గుర్తు ఉంటుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సూచన మేరకు కరోనా వైరస్ వల్ల ఎక్కువమంది బంధువులను వివాహానికి ఆహ్వానించకుండా కేవలం 20 మంది గ్రామ పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మా గ్రామంలో లో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తామని తెలిపారు.

- Advertisement -