ఈ పెళ్లికూతురి బాధను చూసి చ‌లించ‌ని హృద‌యం లేదు..

196
Bride-to-be searches for father after train accident
Bride-to-be searches for father after train accident
- Advertisement -

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదం భారీ సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. అనేక కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 110మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం తర్వాత రూబీ గుప్తా అనే 20 ఏళ్ల యువతి తండ్రి కనిపించకుండాపోయాడు. తన తండ్రి కోసం ఆ అమ్మాయి వెతుకుతున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

రూబీ వివాహం డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. దీంతో బంధువులను కలవడానికి తన తండ్రి రామ్‌ప్రసాద్‌గుప్తా, సోదరులు అర్చన, ఖుషి, అభిషేక్‌, బంధువు రామ్‌ సింగ్‌తో కలిసి అజామాగడ్‌కి ప్రయాణమైంది. ఉదయాన్నే బంధువులను కలుసుకోబోతున్నామన్న సంబంరంలో ఉండగానే ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పటి నుండి రూబీ తండ్రి కనిపించకుండా పోయాడు. ఈ ప్రమాదంలో రూబీ చేయి విరిగింది. వెంట వ‌చ్చిన చెల్లెళ్ల ప‌రిస్థితి కూడా అలాగే ఉంది.

phpThumb_generated_thumbnail

ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్న రూబీ తన తండ్రి కోసం ప్రమాదస్థలంలోనే గాలిస్తోంది. అక్కడున్న వారిని అడుగుతుంటే.. ఆస్పత్రుల్లోనో, శవాగారాల్లోనో వెతకండి అని చెప్తున్నారని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. డిసెంబర్‌లో తన పెళ్లి జరగాల్సి ఉందని.. ఈ వూహించని ప్రమాదం వల్ల పెళ్లి జరుగుతుందో లేదో తెలియకుండా పోయిందని ఆవేదన చెందుతోంది. తమతో పాటు తెచ్చుకున్న పెళ్లి దుస్తులు, ఆభరణాలు కూడా కనిపించడం లేదని రూబీ చెబుతోంది. పెళ్లి సంగతి తర్వాత ముందు తన తండ్రి కనిపిస్తే చాలని అంటోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో తండ్రి కోసం నిస్స‌హాయంగా వెతుకుతున్న రూబీ గుప్తాను చూసి చ‌లించ‌ని హృద‌యం లేదు. ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఆమె క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌లైపోయాయి.

train accident

ఇపుడు ఆ ప్రాంతమంతా బంధువులు, ఆత్మీయులను పోగొట్టుకున్న వారి రోదనలతో విషాద వాతావరణం చోటుచేసుకుంది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు కనపడక తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు. ప్రయాణంలో తమతో కబుర్లు చెప్పిన తోటీ ప్రయాణీకుల కోసం కూడా తీవ్ర అందోళన చెందుతున్నారు.

- Advertisement -