ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు ఇదొక ట్రెండ్. పెళ్లికి ముందే గ్రాండ్ పొటో సేషన్ నిర్వహిస్తున్నారు. అయితే రోజురోజుకు ప్రీ వెడ్డింగ్ షూట్ లో వింతగా వీడియోలు చేస్తున్నారు. అచ్చం సినిమా రేంజ్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. కొత్తగా ఉండాలి.. క్రియేటివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు కపుల్స్ నీళ్లలో శవంలా పడుకుని, మరికొందరు శరీరానికి నిప్పుపెట్టుకుని ఇలా వెరైటీగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ జంట వెరైటీ ప్రీ వెడ్డింగ్ తీయించుకున్నారుజ బైక్పై స్టంట్ చేస్తూ వీడియో తీయించుకున్నారు. అందులో సినిమాల్లో చూపించినట్టుగా సుమోపై నుంచి బైక్పై పెళ్లి బట్టల్లో ఉన్న కొత్త జంట స్టంట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇవి కూడా చదవండి