మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే?

20
- Advertisement -

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది.వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఢిల్లీకి చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఈ ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఖాయమని అంతా అనుకున్నారు. అయితే తాజాగా పరిణామాలు చూస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

ఇక మంత్రివర్గ విస్తరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ నేత కారణంగానే బ్రేక్ పడిందనే ప్రచారం జరుగుతోంది. ఆయన రాసిన లేఖతోనే కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం కానుందని సమాచారం.

ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఆ నేత చక్రం తిప్పడంతో మరికొన్నాళ్లు పాటు వేచి చూసే ధోరణి లో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అడుగడుగునా సీఎంను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆనేత ముందుకు సాగుతున్నారనే పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఇదిగో పులి అంటే అదిగో మేక అన్నట్లు తయారైంది మంత్రివర్గ విస్తరణ అని పలువురు వాపోతున్నారు.

Also Read:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

- Advertisement -