పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సాయిధరమ్‌తో కలిసి నటించిన బ్రో ఈ నెల రిలీజ్ కానుండగా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇందులో హరీశ్ శంకర్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి.
మూడేళ్ల క్రితం అనౌన్స్ అయినా కేవలం రెండు షెడ్యూల్స్ షూట్ మాత్రమే జరిగింది. ఇందుకు కారణం పవన్ డేట్స్ లేకపోవడమే. దీంతో ఉస్తాద్ సినిమా వాయిదా పడటం లేదా ఆగిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మూడేళ్ళుగా వేరే ఏ సినిమా చేయకుండా హరీశ్ శంకర్… పవన్ డేట్స్ కోసం ఎదరుచూస్తున్నారు.
Also Read:బెంగళూరులో విపక్షాల భేటీ..
ఇక హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి కూడా అంతే. రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొంటే నెల రోజుల బ్రేక్ ఇవ్వాల్సి వస్తోంది. దీనికి తోడు ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పవన్ డేట్స్ ఇప్పట్లో అడ్జెట్స్ అయ్యేలా లేవు. దీంతో రెండు సినిమాలకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:నిబంధనల ప్రకారమే శ్రీవాణి నిధులు..