అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్..

62
- Advertisement -

అమర్ నాథ్‌ యాత్రకు తాత్కలికంగా బ్రేక్ పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూలై 1న యాత్ర ప్రారంభం కాగా నిన్నటి వరకు 67,566 మంది యాత్రికులు అమర్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:తమలపాకు తింటే ఎన్ని ఉపయోగాలో..!

పోలీస్, SDRF, ఆర్మీ, పారామిలిటరీ, లేబర్, అగ్నిమాపక, అత్యవసర, విద్య, పశుసంవర్ధక విభాగాలు తమ సిబ్బంది సేవలను అందిస్తున్నాయి. క్యాంప్ డైరెక్టర్ల పర్యవేక్షణలో, లంగర్లు, ఆరోగ్య సౌకర్యాలు, పారిశుధ్యం అనేక ఇతర సహాయాలు అందిస్తున్నాయి. 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. అయితే ప్రస్తుతం తాత్కలికంగా బ్రేక్ పడటంతో ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందనేది అధికారులు వెల్లడించనున్నారు.

- Advertisement -