పులిని ఆటాడించిన బాతు పిల్ల …

209
Bravest Duck Ever plays with Tiger
- Advertisement -

రేయ్.. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో .. చూస్కో. పులితో ఫొటో దిగాలనిపించింది అనుకో .. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే .. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తది ఈ డైలాగ్‌ గుర్తే ఉంటుంది. ఇది సినిమా కాబట్టి ఏదైన సాధ్యమైతుంది. కానీ నిజజీవితంలో పులితో ఎవరైన సాహసం చేయగలరా. అలాంటి సాహసం ఓ బాతు పిల్ల చేసింది.

అసలే ఆకలిమీద ఉన్న పులి వెంటపడిందంటే ఎలాంటి ప్రాణి అయినా పరుగు లంకించాల్సిందే. ఒకసారి పులి పంజా విసిరిందంటే.. ఎలాంటి జీవైనా ప్రాణాలు కోల్పోవాల్సిందే. అంతటి శక్తిమంతమైన పులిని ఒక చిన్న బాతు ఆటాడించిందంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఓ చిన్న బాతు పులిని ముప్పతిప్పలు పెట్టింది. పులిని ఆటపట్టించిన బాతు దాని ఆశలను అడియాసలు చేసింది. చివరికి చేతులేత్తేసిన పులి అక్కడినుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియాలోని సింబియో వైల్డ్‌లైఫ్‌ పార్క్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ వీడియో మీకోసం

- Advertisement -