మహిళల సాధికారత గురించి..మహిళలు వ్యక్తిగతంగా.. ఆర్ధికపరంగా అభివృద్ది గురించి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక ఇప్పటి పలుమార్లు తనదైన రీతిలో స్పందించింది. అయితే తాజాగా ప్రియాంక మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. అసోం టూరిజం ప్రచారకర్తగా కూడా ప్రియాంక నియమితులైన సందర్బంగా మీడియాతో ఫెమినిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని..మహిళలు మగవాడిపై ఆధారపడి బతికే రోజులు పోయాయని చెప్పింది. కేవలం శృంగార అవసరాలను తీర్చుకోవడానికే ఆడవారికి మగవారితో అవసరం ఉందని గుండబద్ధలు కొట్టేలా స్పందించింది. సామాజికంగా, ఆర్ధికంగా అన్నింట్లోను మహిళలు మగవారితో పోటీ పడుతున్నారని తేల్చిచెప్పింది.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ప్రియాంక..రీసెంట్‌గా హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. ‘క్వాంటికో’ సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. తోలిసారి హాలీవుడ్ మూవీ ‘బేవాచ్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకిత్తించడానికి రెడీ అయింది. ఇందులో ప్రియాంక నెగిటీవ్ రోల్ లో కన్పించనుందట. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఇటు సినిమాలతో పాటు రెట్ కార్పేట్ షో లతో కూడా అమ్మడు ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటోంది..బైవాచ్ సినిమాతో ఇండియన్ లేడి పరరేంటో చూపించేందుకు సిద్ధమవుతోంది.