Bhola Shankar:బ్రహ్మానందం డబ్బింగ్ పూర్తి

32
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. హాస్య బ్రహ్మా బ్రహ్మానందం డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. హాస్య బ్రహ్మ డబ్బింగ్‌ పనులు పూర్తి చేశారు. ఇందులో ఆయన అతిథిగా కీలక పాత్ర పోషించారు. థియేటర్‌లో ఆయన నవ్వులు పూయించడం ఖాయం అని పేర్కొన్నారు.

ఇటీవల రిలీజైన ‘జాం జాం జాం జజ్జనక’ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్‌ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది.

Also Read:సినీ రంగంలోకి షర్మిల కొడుకు!

- Advertisement -