ఎంపీ సంతోష్‌కి బ్రహ్మ కుమారీస్ ఆహ్వానం

144
gic
- Advertisement -

ఆధ్యాత్మికత, యోగా రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది బ్రహ్మా కుమారీ సమాజం. యోగా,వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను బోధించే బ్రహ్మకుమారీలు.. 50 వ “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా మొక్కలు నాటాలనే సంకల్పంతో “కల్ప తరు” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం కులషితమైపోయి మనిషి మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందనే ఆవేదన.. మొక్కలు నాటడం మాత్రమే ఈ సృష్టిని కాపాడగలవనే నమ్మకంతో బ్రహ్మకుమారీ సమాజం “కల్ప తరు” పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నామని వారు తెలిపారు. గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక కార్యమానికి ముఖ్య అతిథిగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్యాడు, రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు వారు తెలిపారు.5 జూన్ నుండి ఆగస్టు 25 వరకు జరగనున్న “కల్పతురు క్యాంపెయిన్” క్యాంపెన్ ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని బ్రహ్మకుమారీస్ సెంటర్ల తరపున 40 లక్షల మందితో కనీసం 40 లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నట్లు బ్రహ్మకుమారీలు తెలిపారు. మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాజయోగిని బీబీ కుల్దీప్ దీదీ జీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ..ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌న‌మంతా మ‌న బాధ్య‌త‌ను మ‌రొక్క‌సారి గుర్తు చేసుకుందాం. ప్ర‌కృతిని మ‌నం ర‌క్షిస్తే.. అది మ‌న‌ను ర‌క్షిస్తుంది. మ‌న భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఆస్తులు ఇవ్వ‌క‌పోయినా బ‌తుక‌గ‌ల‌రు. కానీ, ఆక్సీజ‌న్ లేకుండా బ‌తుక‌లేరు. ప్రాణ‌కోటికి జీవ‌నాధార‌మైన ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న అంద‌రిదీ. ప్ర‌కృతిపై మ‌న‌కు హ‌క్కే కాదు.. బాధ్య‌త కూడా ఉండాలి. భావిత‌రాల‌కు ప‌చ్చ‌ని బ‌తుకునివ్వాలంటే.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాలి. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోక‌పోతే.. మ‌న కూర్చున్న కొమ్మ‌ను మ‌నం న‌రుక్కున్న‌ట్టే. మ‌న అవ‌స‌రాల కోసం.. మ‌న మ‌నుగ‌డ కోసం మ‌న‌కు ఆధార‌మైన ప్ర‌కృతిని నాశ‌నం చేస్తున్నాం. అడ‌వుల‌ను న‌రికివేస్తున్నాం. వాతావ‌ర‌ణాన్ని, నీటిని క‌లుషితం చేస్తున్నాం. వీటి ప‌ర్యావ‌స‌నాలు అన్నీ ఇన్ని కావు. మ‌న‌తో స‌మాన‌మైన జీవ‌న హ‌క్కులున్న జీవ‌రాసులు అంత‌రించిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాం. ఒక స‌ర్వే ప్ర‌కారం ప్ర‌కృతి విధ్వంసం ఇదే విధంగా కొన‌సాగితే.. రాబోయే ప‌దేళ్ల‌లోనే సుమారు ప‌ది ల‌క్ష‌ల జీవ‌, జంతుజాలం అంత‌రించే ప్ర‌మాదం ఉన్న‌ది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌న‌మంతా న‌డుం బిగిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో హ‌రిత హారం పేరుతో మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టారు. మ‌న రాష్ట్రంలో గ‌డిచిన ఎనిమిదేళ్ల‌లో సుమారు 8 శాతం అడ‌వుల‌ను అద‌నంగా పెంచ‌గ‌లిగాం. 240 కోట్ల‌కుపైగా మొక్క‌ల‌ను నాటాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ప్ర‌జ‌ల్లో ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌న పెంచే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. రండి.. చేయి చేయి క‌లుపుదాం. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌న‌వంతు తోడ్పాటును అందిద్దాం అని చెప్పారు.

- Advertisement -