- Advertisement -
హైదరాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి గుండెను తరలించారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి గుండెను తరలించారు.ఇందుకోసం నాగోలు మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని వైద్యులు ఎంచుకున్నారు. మెట్రో రైలు అధికారులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఈ ఏర్పాట్లు చేశారు.
నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్యక్తికి అమర్చనున్నారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో ఈ శస్ర్తచికిత్స నిర్వహించనున్నారు.
- Advertisement -