31న బ్రాహ్మణ పరిషత్ భవనం ప్రారంభం..

18
- Advertisement -

ఈ నెల 31 బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ గోపన్‌పల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని నిర్మించారు. ఈ కార్యక్రామానికి పీఠాధిపతులు,మతపెద్దలను ఆహ్వానించాలని నిర్ణయించారు.

దేశంలోని బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమానికి పిలవాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆధ్మాత్మిక ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవింపజేసుకోవాలని, నాటి భాషా కవి పండితుల చరిత్రలను వెలికితీయాలన్నారు. బ్రాహ్మణ పరిషత్‌ భావితరాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతుందన్నారు. దేశంలోని బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను కార్యక్రమానికి పిలవాలని సూచించారు.

Also Read:చరణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్

బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పౌరోహిత్యం నమ్ముకున్న బ్రాహ్మణ పిల్లలకు చదువులు అందిస్తున్నట్లు తెలిపారు. మల్లినాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, విశ్వవిద్యాలయం కోసం చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

- Advertisement -