అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి- ఎమ్మెల్సీ కవిత

145
mlc kavitha
- Advertisement -

హైదరాబాద్‌లో బ్రహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 53 బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవిత శుక్ర‌వారం కలిసారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అర్చకులకు నెల నెలా గౌరవ వేతనం అందించడం, రాష్ట్రంలోని 3645 దేవాలయాల్లో ధూప, దీప నైవేద్య కార్యక్రమాల కోసం ప్రతి ఏటా రూ.26 కోట్లు కేటాయించడంపై బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మించడంతో పాటు, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించడంపై బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మ‌ణ ప‌క్ష‌పాతి అని పేర్కొన్నారు. బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించగా, వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కవిత హామీ ఇచ్చారు. పేద బ్రాహ్మణులకు సైతం ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తాన్నారు.

- Advertisement -