తాత మనవళ్లుగా తండ్రీకొడుకులు..!

30
- Advertisement -

టాలీవుడ్ హాస్య బ్రహ్మా ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది బ్రహ్మానందం. ప్రస్తుతం చిన్న చిన్న క్యారెక్టర్ సినిమాలు చేస్తు బిజీగా ఉన్న బ్రహ్మానందం..తాజాగా తన తనయుడితో సినిమా చేయనున్నారు. బ్రహానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాలా సంవత్సరాల తర్వాత సినిమా రానుంది.

ఇక ఈ సినిమాని అనౌన్స్‌ చేస్తూ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేశారు బ్రహ్మానంద్ం. ఈ సినిమాకు ‘బ్రహ్మా ఆనందం’ అనే టైటిల్ ఖరారు చేయగా తాత, మనవడిగా కనిపించబోతున్నారు తండ్రీ కొడుకులు.

ఈ వీడియోలో రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కలిసి బ్రహ్మానందంను తాత పాత్రకు ఒప్పిస్తున్నట్టు ఉంది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరిస్తుండగా RVS నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనుండగా 6 డిసెంబర్ 2024న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

Also Read:నిమ్మకాయతో చర్మ సమస్యలకు చెక్!

- Advertisement -