టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య చిక్కుల్లో పడ్డాడు. ట్విట్టర్లో ఓ ఫేక్ అకౌంట్‌తో వివాదంలో చిక్కుకున్న పాండ్యాపై కేసు నమోదుచేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని కించపరిచేలా మాట్లాడిన పాండ్యాపై రాష్ట్రీయ భీమ్ సేనా సభ్యుడు జోధ్‌పూర్‌లోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించగా కేసు నమోదుచేయాలను కోర్టు తెలిపింది.
అయితే ఈ అకౌంట్ హార్ధిక్‌ది కాదు. గతేడాది డిసెంబర్ 26న పాండ్యా పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌తో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల వ్యాధిని వ్యాప్తి చేసిందని అంబేద్కర్ అని @sirhardik3777 అకౌంట్ నుంచి ట్విట్ చేశారు. అప్పట్లో అది వివాదాస్పదంగా మారింది.
వాస్తవానికి హార్ధిక్ ట్విట్టర్ అకౌంట్ @hardikpandya7తో ఉంది. మేఘవాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఓ ఎస్సీ, ఎస్టీ కోర్టు పాండ్యాపై కేసు నమోదు ఆదేశించింది. అయితే దీనిపై అటు పిటిషనర్గానీ, పాండ్యాగానీ ఇంకా ఏమీ స్పందించలేదు.