తెలంగాణ నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనే సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం.. ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, సైదిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కొనియాడారు. చట్ట సభలకు దిశా నిర్దేశం చేసిన అంబేద్కర్, అటువంటి మహానీయుని పేరు తెలంగాణ సచివాలయానికి నామకరణం చేయడం కేసీఆర్‌కు.. మహనీయులు, దళిత జాతి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని చెప్పారు.