‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్’ ఫస్ట్ లుక్..

112
Viswant

విశ్వంత్, మాళవిక జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ కూల్ లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను స్వస్తిక సినిమా మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లో నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు త్వరలో విడుదల కానున్నాయి. బాలసరస్వతి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు విజయ్ వర్ధన్ ఎడిటర్. పూజా రామచంద్రన్, మధు నందన్ ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

నటీనటులు:విశ్వంత్ దుద్దుమ్పూడి, మాళవిక సతీషన్,పూజా రామచంద్రన్, మధు నందన్, రాజా రవీంద్ర, హర్షవర్ధన్, శివనారాయణ (అప్పాజి),రూప లక్ష్మీ,నెల్లూరు సుదర్శన్

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: సంతోష్ కంభంపాటి
నిర్మాతలు: వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి
బ్యానర్స్: స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశ్రిన్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
కెమెరామెన్: బాల సరస్వతి
ఎడిటింగ్: విజయ్ వర్ధన్
పిఆరోఓ: వంశీ శేఖర్
పోస్టర్ డిజైన్: అనిల్ భాను