చరణ్ మూవీ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ భామ..!

325
- Advertisement -

బోయపాటి దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్‌ తేజ్ చేస్తున్న సినిమాకు “వినయ విధేయ రామ” అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కైరా అద్వాని నటిస్తోంది. ప్రశాంత్, స్నేహ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ ఒబెరాయ్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నాయి.

అయితే.. ఈ సినిమాలో మంచి ఐటమ్ సాంగ్ చేయాలని బోయపాటి భావించారు. సినీ అభిమానులను అలరించే విధంగా ఓ మాస్ సాంగ్‌ను రూపొందిస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్‌ కోసం దేవీశ్రీ ప్రసాద్‌తో మాట్లాడి, అభిమానులను ఊర్రూతలూగించేలా  సాంగ్ ఉండాలని చెప్పాడట. ఇక దేవీ శ్రీ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాడు. ఏ హీరోయిన్‌ను పెట్టి, ఐటమ్ సాంగ్ చేయాలని వేట మొదలు పెట్టాడు. ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ ఏ హీరోయిన్‌ను తీసుకోవాలని ఆలోచనలో పడ్డాడు.

తీవ్ర కసరత్తు అనంతరం బాలీవుడ్ హీరోయిన్ అయితేనే ఈ సినిమాకు తగ్గట్టుగా ఉంటుందని మూవీ యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చారట. ఇక తర్వలోనే ఆ బాలీవుడ్ భామ ఎవరో అభిమానులకు చెప్పనున్నారు. చరణ్ సరసన ఏ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ దక్కించుకుందని అభిమానులు అసక్తితో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -