ఆ యువకుడి ఐడియాకి మోదీ షాక్‌..!

367
- Advertisement -

ప్రభుత్వాలు మారడం కామన్‌. ఆ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు మారడం కూడా ఎంత కామనో వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్‌ ని మాత్రం దేశప్రజలు మర్చిపోలేరనే చెప్పాలి.

ఒక రకంగా చెప్పాలంటే.. అదే ప్రాజెక్టుని దేశ ప్రజలందరూ తప్పకపాటిస్తే..ప్రధాని కల నెరవేరినట్టే.! అయితే ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ కోసం దేశప్రజల్లో కూడా అడుగులు మొదలయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే..ప్రధాని ప్రవేశపెట్టిన ఆ ప్రాజెక్ట్‌కి ప్రజల్లో అంతటి పేరొచ్చింది మరి. అయితే ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటనేగా మీ సందేహాం?
Boy tweets sister's marriage card with Swachh Bharat logo
యావత్‌ దేశాన్ని కదిలించిన ఆ ప్రాజెక్టే…’స్వచ్ఛభారత్‌’. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే యావత్‌ దేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించేందుకు ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టే ఈ ‘స్వచ్ఛభారత్‌’. అయితే ఈ అంశం పార్టీలకు సంబంధించినది కాదు. రాజకీయాలకు సంబంధించినది  అంతకంటే కాదు. దేశాన్ని స్వచ్చత వైపు నడిపించేందుకు మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి దేశ ప్రజలు నడుంబిగించారనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. స్వచ్ఛభారత్‌ కోసం తన వంతుగా కృషి చేయడానికి తన ఆలోచనతో అందరినీ ఆశ్ఛర్యపరిచాడు ఓ కర్ణాటక యువడుకు. ఇప్పటి వరకూ ఎవరికీ రాని ఆలోచనతో అందరినీ ఆలోచింపజేశాడు. అయితే కర్ణాటకు చెందిన ఆకాష్‌ జైన్‌ అనే యువకుడు తన చెల్లెలు వివాహ ఆహ్వాన పత్రికలో ‘స్వచ్చ భారత్‌’ లోగోను ముద్రించి, దాన్ని ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు. ఇంకేముంది దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేనా… దీంతో ఆ యువకుడు మోదీని సైతం ఆశ్చర్యపరిచాడు.
 Boy tweets sister's marriage card with Swachh Bharat logo
ఇక ఆ ఆహ్వాన పత్రికి ట్విట్టర్‌ పోస్ట్ పై  ఏకంగా మోదీ రీ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఆయన పాలోవర్‌గా ఆకాష్‌ జైన్‌ ను కూడా కలుపుకున్నారు మోదీ. ఇంకేముంది ఆ యువకుడి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అయితే ఇదంతా తన తండ్రి  చెప్పడంతోనే  చేశానని, తన తండ్రి ప్రధానిని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఫాలో అవుతారని చెప్పాడు. ఏదేమైనా..స్వచ్ఛభారత్‌ లోగోతో ఈ యువకుడు చేసిన పనికి సోషల్‌ మీడియాలో తనపై ప్రశంసల వర్షమే కురుస్తోంది.

- Advertisement -