ఎన్నో అద్భుతమైన ఘట్టాల నడుమ స్వాతంత్ర్యం సాధించుకున్నాం.ఎందరో త్యాగధనులు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలారు. అలా పోరాటం చేసిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. పోరాటంలో భాగంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ని స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్యాలపై తిరుగుబావుట ఎగర వేశాడు. బోస్ జీవిత నేపథ్యంలో `బోస్: డెడ్ ఆర్ అలైవ్` టైటిల్ తో తాజాగా ఓ వెబ్ సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే.
నాకు రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను` అన్ని విప్లవయోధుడు బోస్ తర్వాత నేతాజీగా ఎలా మారాడు? ఆయన మరణం వెనక ఉన్న కారణాలేంటి? వంటి ప్రశ్నలకు ఈ వెబ్‌సిరీస్‌లో సమాధానాలు దొరకనున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుండగా, ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేసిన టీం ఈ రోజు ట్రైలర్ ని రిలీజ్ చేసింది. పుల్కిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ కి ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రైలర్ సిరీస్ పై భారీ అంచనాలు పెంచింది. త్వరలో ఈ సిరీస్ `ఏఎల్‌టీ బాలాజీ` అనే వెబ్ ఛానల్‌లో ప్రసారం కానుంది. ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
https://youtu.be/FF8wWILATMM