రేసు నుంచి తప్పుకోండి రిషికి జాన్సన్‌ విజ్ఞప్తి

329
- Advertisement -

బ్రిటన్‌లో నెలకొన్న ఆర్థిక రాజకీయ సంక్షోభంను రూపుమాపడంలో విఫలమైనందకు బాధ్యతగా ప్రధాని లిజ్‌ట్రస్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌‌పై విజయం సాధించిన లిజ్‌ ట్రస్‌.. ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. తన ఆర్ధిక విధానాలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవడంతో 45రోజులకే అనూహ్యంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ట్రస్‌ రాజీనామాతో బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పీఠంపై కన్నువేశారని పలువురు విశ్లేషిస్తున్నారు.

ట్రస్‌ రాజీనామాతో భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్‌ మరోసారి ప్రధాని రేసులో నిలిచారు. ప్రధాని అయ్యేందుకు కావాల్సిన అర్హతలను అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు వంద మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. అయితే, మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌మరోసారి ఆ పోస్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరీబియన్‌ దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న బోరిస్‌.. హుటాహుటిన మళ్లీ బ్రిటన్‌కు బయలుదేరారు.

ప్రధాని రేసు నుంచి తప్పుకోవాలంటూ రిషి సునాక్‌ను కోరినట్లుగా సమాచారం. కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడం చాలా ముఖ్యమని.. ప్రధాని రేసు నుంచి తప్పుకుని తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

- Advertisement -