KAVITHA:సరిహద్దులో జవాన్‌..పంట పొలంలో రైతు

49
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సదాశివనగర్‌ మండలం పద్మాజివాడలో నిర్వహించిన రైతు దినోత్సవంలో కవిత పాల్గొన్నారు. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని పని సీఎం కేసీఆర్ రైతులకు మర్యాద తెచ్చిందన్నారు. నకిలీ విత్తనాల జాడ లేదన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మిన వాళ్లపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నమన్నారు. ఇలా దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదన్నారు. రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అని అన్నారు. మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామ‌ని క‌విత పేర్కొన్నారు. దీంతో భూగ‌ర్భ జ‌లాలు కూడా పెరిగాయ‌న్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామ‌ని చెప్పారు. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింద‌న్నారు.

Also Read: KTR:కరువునేలగా అల్లాడిన నేల.. దేశానికే బువ్వపెడుతుంది

రైతులకు లాభదాయకమైన పంటల వైపు దృష్టి పెట్టాలని కవిత సూచించారు. సరిహద్దు జవాన్‌..పంట పొలంలో రైతు ఇద్దరి వల్లే మనం ప్రశాంతంగా ఉన్నామని అన్నారు. వ్యవసాయం అంటే దండగ అన్న స్థితి నుంచి పండగ అనే స్థాయికి చేరిందని అన్నారు. రైతు బంధు రైతు బీమాతో అన్నదాతలకు సీఎం కేసీఆర్‌ అండగా ఉన్నారని అన్నారు.

Also Read: కొలంబియా: అమెజాన్‌లో పసివాళ్లు ఏమయ్యారో..!

- Advertisement -