బూట్‌ కట్ బాలరాజు…అలరిస్తుంది: సోహెల్

31
- Advertisement -

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘బూట్‌ కట్ బాలరాజు’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సోహెల్ మాట్లాడుతూ.. మా బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు. విజయ్ గారు లాంటి వారు వచ్చి సపోర్ట్ చేయడం చాలా అనందంగా వుంది. నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నాతో సినిమా చేస్తానని చెప్పారు పాషా భాయ్. ఆయన సాధారణమైన వ్యక్తే. చాలా హార్డ్ వర్క్ చేసిన ప్యాషన్ తో సినిమాని పూర్తి చేశాం. ఒక నటుడు సినిమాతో పాటు సీరియల్, వెబ్ సిరిస్, షార్ట్ ఫిల్మ్ ఇలా ఏది చేసిన అది వాళ్ళ సర్వైవల్, గుర్తింపు కోసం. నేను షార్ట్ ఫిల్మ్ నుంచి ఒకొక్క మెట్టుఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను. హీరో వెంకటేష్ గారి ఈ సినిమా గురించి మెసేజ్ చేశాను. ఆల్ ది బెస్ట్ చెబుతూ వాయిస్ మెసేజ్ పెట్టారు. అంత పెద్ద హీరో నాకు రిప్లయ్ ఇవ్వడం చాలా నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చింది. నాలాంటి యంగ్ స్టర్స్ ఇలాంటి సపోర్ట్ నే ఆశిస్తారు. మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక నిర్మాత కష్టం నటుడి నుంచి నిర్మాతగా మారినప్పుడు అర్ధమైయింది. నిర్మాతలందరికీ హ్యాట్సప్. భీమ్స్ అన్న అద్భుతమైన పాటలు ఇచ్చారు. టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఫిబ్రవరి 2న బూట్‌ కట్ బాలరాజు వస్తోంది. మీ జీతాలతో మా జీవితాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”అన్నారు.

హీరో శివాజీ మాట్లాడుతూ.. ఈ సినిమా యూనిట్ అంతా నాకు మంచి స్నేహితులు. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. సోహెల్ లో మంచి తపన వుంది. తను తప్పకుండా విజయం సాధిస్తాడు. తప్పకుండా నిలబడతాడు. ఎదుగుతున్న నటుడికి అందరూ ప్రోత్సాహం అందించాలని కోరుతున్నాను. మంచి కథని పట్టుకోవడం గోపి దిట్ట. తను చేసిన ప్రతి సినిమా విజయం సాధించింది. భీమ్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అన్నారు.

హీరో శివబాలాజీ మాట్లాడుతూ.. సోహెల్ బిగ్ బాస్ ఏడు సీజన్ ల మెంబర్స్ ని ఒక గ్రూప్ గా పెట్టాడు. అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చాడు. బూట్‌ కట్ బాలరాజు ట్రైలర్ నచ్చింది. పాటలు ఇంకా నచ్చాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. మీ అందరి సహకారం కావాలి” అన్నారు

హీరో బాలాదిత్య మాట్లాడుతూ.. బూట్‌ కట్ బాలరాజు తో ఈ చిత్ర యూనిట్ కి మంచి పేరు రావాలి. సోహెల్ కి చాలా ప్యాషన్ వుంది. ఆయన పడుతున్న కష్టం కనిపిస్తోంది. బూట్‌ కట్ బాలరాజు తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. తెలుగు సినిమాలో మైలు రాయిగా నిలిచిన శంకరాభరణం, నా కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన లిటిల్ సోల్జర్స్ చిత్రాలు ఫిబ్రవరి 2నే విడుదలయ్యాయి. ఆ డేట్ కి ఏదో మ్యాజిక్ వుంది. అదే డేట్ కి వస్తున్న బూట్‌ కట్ బాలరాజు కూడా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. అందరూ సినిమాని సపోర్ట్ చేయాలి” అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. కంటెంట్ వున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది. రెండున్నరేళ్ళుగా ఒక టీం వర్క్ లా చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ పైసా వసూల్ వస్తుంది. సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది” అన్నారు.

Also Read:తండ్రైన టాలీవుడ్ నటుడు..

- Advertisement -