పవన్‌పై మాజీ ఎంపీ బూర ప్రశంసలు

153
boora
- Advertisement -

జనసేనాని,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు గుప్పించారు టీఆర్ఎస్‌ నేత,మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభలో తన పేరును పవన్ ప్రస్తావించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సంచార జాతులకు, అణగారిన వర్గాలకు ఆర్థిక పరిపుష్ఠి కలగాలి, వారు ఆర్థికంగా బలపడాలని నాకు ఉపదేశం చేసిన బూర నర్సయ్య గౌడ్‌ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

పవన్ మాట్లాడిన వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసిన బూర….మీరు నా పేరు ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. మీలో ఉన్న సామాజిక అగ్ని, తపన, సమ సమాజ స్థాపనకు నిబద్ధతతో ఏపీ రాజకీయాలలో పెను మార్పు తథ్యం. సూక్ష్మ ప్రణాళికతో అనాదిగా కొనసాగుతున్న రాజకీయ ఫ్యూడలిజాన్ని ఛేదిస్తారని ఆకాక్షిస్తున్నాను అని తెలిపారు.

https://fb.watch/bLUMtXSVLl/

- Advertisement -