- Advertisement -
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు గల జుంక్షన్ అభివృద్ధికి, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాల గూర్చి జీహెచ్‌ఎంసీ,ఆర్టీసీ,ట్రాఫిక్,సీఆర్ఎంపీ కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధుల తో కలసి క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు మేయర్ బొంతు రామ్మోహన్.
ప్రపంచ స్థాయి స్టేషన్ గా ఎదుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం వచ్చి పోయే ప్రయాణికులకు తగిన వసతులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ,జుంక్షన్ అభివృద్ధి, వంటి విషయాల పై వివిధ విభాగాల అదికారులతో పరిశీలించారు,.
ముఖ్యంగా స్టేషన్ కు వచ్చే వాహనాలకు, ప్రత్యేక లైన్ ల ఏర్పాటు ,సాధారణ వాహనాలను రి రూటింగ్ చేయడం వంటి విషయాల తో పాటు సెంట్రల్ మిడియన్లు,బస్ షెల్టర్ల ఆధునీకరణ,అధునాతన మరుగుదొడ్లు, షి టాయిలెట్స్ ఏర్పాటు, ప్రయాణికులకు ఎండకు వానకు రక్షణ ఇచ్చేలా షెడ్ ల ఏర్పాటు పై పరిశీలన చేశారు.
- Advertisement -