టీడీపీ మాజీ ఎమ్మెల్యే బంగీజంప్‌…

652
bonda uma
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి బావగారు బాగున్నారా సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చిరు చేసిన బంగీ జంప్‌ టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి అలా బంగీ జంప్ చేయడాన్ని చూసి అభిమానులు, వీక్షకులు నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత కూడా చాలామంది ఈ ఫీట్ చేశారు.

తాజాగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక కవారౌ బ్రిడ్జ్ మీద నుంచి బంగీ జంప్ చేశారు. 134 మీటర్ల ఎత్తు నుంచి నదిలోకి జంప్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

టీడీపీ తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించిన బొండా ఉమా… గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు.

గతంలో వైసీపీ అధినేత,ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ కూడా న్యూజిలాండ్ పర్యటన వెళ్లిన సందర్భంగా బంగీ జంప్ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

- Advertisement -