రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మహంకాళి బోనాలు కన్నుల పండువగా జరిగాయి. మంగళవారం బోనాల వేడుకలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. స్వయంగా బోనమెత్తిన వెంకయ్య…మహంకాళి అమ్మవారికి కేంద్రం తరపున పట్టువస్ర్తాలు సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. భావితరాలకు సంప్రదాయ పండుగలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, ఆలయ కమిటీ నిర్వాహకులకు వెంకయ్య అభినందనలు తెలిపారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ గత మూడేండ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఇండియా గేట్ దగ్గర ఉన్న ఢిల్లీ ప్రజలు బోనాల సంబురాలను ఆసక్తిగా తిలకించారు.
Partaking in the 109th Bonalu Utsavalu celebrations held at Telangana Bhavan in New Delhi today. pic.twitter.com/vPaJDOgT6y
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 27, 2017