ఫ్లోరిడాలో అంబరాన్నంటిన బోనాల సంబరాలు

365
Bonalu
- Advertisement -

ఫ్లోరిడాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. మియామీ సిబి స్మిత్ పార్క్‌లో  జరిగిన ఈ కార్యక్రమంలో వేదపండితులుపూజలు జరిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చందు తాళ్ల మాట్లాడుతూ బోనాల పండుగ అన్నది జీవ వైవిధ్యాన్ని సూచిస్తుందని, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగ నిలుస్తుందని, ప్రపంచం లో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కలుసుకోవడానికి తోడ్పడుతుందని, అంతే కాకుండా మహిళా సాధికారతకు కూడా బోనాలు పండుగ అనేది చిహ్నంగ ఉపయోగపడుతుందన్నారు.

bonalu florida

స్థానిక ఎగ్జిక్యూటివ్ కమిటి మెంబెర్ మోహిత్ కర్పూరం ఈ కార్యక్రమానికి అధ్యక్షతవహించారు .స్వాతి జలగం ఆధ్వర్యములో చక్కని సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ప్రముఖ సంఘ సంస్కర్త గుమ్మకొండ రెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ శేఖర్ రెడ్డి ,శైలజ రెడ్డి మరియు వందలాది మంది స్థానికుల, సహకారంతో మేళ తాళాలతో,తీన్మార్ డాన్సులతో అత్యంత వైభవంగా బోనాలను ఊరేగించారు.

నిర్వాహకులు పిల్లల కోసము ప్రత్యేకంగా ఏర్పర్చిన పోనీ రైడ్స్ కార్యక్రమం ఆకర్షణ గా నిలిచింది.రాజు భాషాబోయిన, ప్రతిభ రాజు ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు చందు తాళ్ల, మోహిత్ కర్పూరం, శేఖర్ రెడ్డి, శైలజ రెడ్డి, డా.రాజేందర్ రెడ్డి చెరుకు, దేశిక చెరుకు,శశి గుడాల , నిరుపమా రెడ్డి, శరత్ కొత్తకాపు ,శ్యామా మార్గని ,వీణ తల్లా ,శ్వేతా ,సునీల్ ,రాజేందర్ రెడ్డి బెక్కరి, రాజ్ సారెడ్డి ,అనిల్ ఆది ,రవి అండపల్లి, లష్మికాంత్ కళ్ళం, షర్మిల, ఉపాధ్యక్షులు అవినాష్ రామ,స్వాతి జలగం,రవి వుమ్మగోని,అనిల్ బండారం,శ్రీనివాస్ గడ్డం,అశోక్ వర్ధన్ ,లతా రెడ్డి ,సంతోష్ గూడూరు, డా. శ్రీనివాస్ దొంతినేని, నరేందర్ కొమ్మ, శ్రీనివాస్ముతినేని, వెంకట్ కంచర్ల, శ్రీకాంత్ జలగం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లతా రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

bonalu

- Advertisement -