ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు

13
- Advertisement -

ఢిల్లీలోని ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఏపీ భవన్‌ని పేల్చేస్తామని ఆగంతకుల మెయిల్ సంచలనం సృష్టించింది. ఏపీ భవన్‌కు శుక్రవారం రాత్రి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.

ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌కు మెయిల్‌ చేశారు. భవన్‌లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఢిల్లీ పోలీసులతో కలిసి గంటకుపైగా తనిఖీలు చేపట్టారు.

Also Read:TTD:4న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ

- Advertisement -