తమిళ హీరో విజయ్ తాజాగా నటించిన చిత్రం ‘బిజిల్’ తెలుగులో విజిల్ పేరుతో విడుదులైన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద భారీ వసుళ్లు చేస్తోంది. అయితే సినిమా హడావుడిలో ఫ్యాన్స్ మరియు హీరో ఫ్యామిలీ ఉండగా ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి విజయ్ ఇంట్లో బాంబు పెట్టాను మరికాసేపట్లో పేళబోతుంది అంటూ చెప్పాడట.
దాంతో వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున విజయ్ ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో బాంబు స్వ్కాడ్ కూడా విజయ్ ఇంటికి వెళ్లి అణువణువు చెక్ చేశారట. దాదాపు 30 నిమిషాల పాటు చెక్ చేసిన తర్వాత ఇంట్లో బాంబు లేదని గుర్తించారు. అనంతరం విజయ్ తండ్రి ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ నివాసానికి కూడా పోలీసులు వెళ్లారు. అక్కడ కూడా తనిఖీలు చేశారు. అయితే అక్కడ బాంబ్ జాడ లేకపోవడంతో అది గాలి వార్త అని పోలీసులు తేల్చారు.
ఆ తర్వాత ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అళపాక్కమ్ ప్రాంతంలోని పోరూర్ సమీపం నుంచి ఆ కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఫోన్ చేసిన కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలిసులు తెలిపారు. ఈ విషయంపై ముమ్మరంగా విచారణ చేపడతామని చెన్నై పోలీసులు అంటున్నారు.