తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు…

277
taj mahal
- Advertisement -

ప్రపంచంలోనే అందమైన కట్టడం తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్‌మహల్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు…పర్యాటకులను ఖాళీ చేయించి తాజ్‌మహల్‌ సందర్శనను నిలిపివేశారు.

తాజ్ మహల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు బెదింపు రావడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -