పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగుతుండగా, ముర్షిదాబాద్ జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నౌదా ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులతో దాడి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఓటింగ్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా బాంబులు విసరడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. “వారు మమ్మల్ని బూతులు తిడుతూ దాడికి దిగారు.. మేము ఎవరి జోలికీ వెళ్ళలేదు” అని గాయపడిన ఒక బాధితుడు తెలిపారు.
గత 24 గంటల్లో ముర్షిదాబాద్ జిల్లాలో ఇది రెండో దాడి. బుధవారం రాత్రి శివనగర్ ప్రైమరీ స్కూల్ సమీపంలో బాంబులు విసరడంతో ఒక మహిళ గాయపడింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి షహీనా ముమ్తాజ్ ఖాన్ తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
జిల్లాలో వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI) ముర్షిదాబాద్‌ను నిశితంగా పర్యవేక్షిస్తోంది.ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) మనోజ్ అగర్వాల్ స్పందిస్తూ.. “ఈ ఘటనపై నివేదిక కోరాము. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని స్పష్టం చేశారు.నిరంతర హింసాత్మక ఘటనల దృష్ట్యా, ముర్షిదాబాద్ జిల్లా ప్రస్తుతం ఎన్నికల అధికారుల ప్రత్యేక నిఘాలో ఉంది.
ALso Read;సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు

